కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయకుండా చేపల వేటకు పిల్లవాడిని వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యతను పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం లో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నా యి.. 23 నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం కా గా.. పరీక్షలకు గైర్హాజరవుతున్న పలువురు విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ నజర్ పెట్టింది. ఇందు లో భాగంగా పరీక్షలకు హాజరుకాని వారిపై జి ల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు దృష్టి సారించారు. వారి వివరాలను సేకరించి పరీక్షకు హాజరుకాకపోవడానికి ఉన్న కారణాలను తెలుసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
రంగంలోకి దిగిన కొల్లాపూర్లోని జిల్లా పరిషత్ గాంధీ స్మారకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు కురుమ య్య, శ్రీకాంత్తో కలిసి పట్టణానికి చెందిన వి ద్యార్థి లింగస్వామి రెండు పరీక్షలు రాయలేదని గుర్తించారు. సదరు విద్యార్థి ఇంటికి మంగళవా రం రాత్రి వీరు వెళ్లారు. తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకత, వారి బిడ్డ భవిష్యత్ గురించి వివరించారు. మీరే పరీక్ష రాయనీయకుండా బాలుడిని చేపల వేటకు తీసుకెళ్లడం సమంజసం కాదని అ వగాహన కల్పించారు. మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలకు వద్దని.. పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
దీంతో తల్లిదండ్రులు బిడ్డ ఉజ్వల భవిష్యత్ కోసం మనసు మార్చుకున్నారు. విద్యార్థి లింగస్వామి ఇప్పటికే తెలుగు, హిందీ పరీక్షలు రాయకపోవడంతో ఉపాధ్యాయుడు శ్రీకాంత్ బుధవారం ఉదయమే ఇంటికి వెళ్లి విద్యార్థి లింగస్వామిని బైక్ మీద తీసుకెళ్లి గాంధీ స్మారకోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లాడు. ఇంగ్లిష్ పరీక్షను సదరు విద్యార్థి రాశాడు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు గురుతర బాధ్యతను నెరవేర్చడంపై విద్యావంతులు అభినందిస్తున్నారు.