దేవరకద్ర రూరల్, మే 25 : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను గ్రా విటీ నిర్మించి 11 గ్రామాల చెరువులను నీటితో నింపేందుకు కృషి చేస్తున్నట్లు దే వరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వాటర్‌షెడ్ పీఎస్ఐ కార్యక్రమంలో భా గంగా చౌదర్పల్లి ప్రాజెక్టు కింద మూడు గ్రామాల రైతులకు, లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన 15 మంది రైతులకు, హజిలాపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు రైతులకు, బల్సుపల్లి గ్రామానికి చెందిన ఇద్ద రు రైతులకు కలిపి మొత్తం 24 మంది రైతులకు 75 శాతం రాయితీపై పీవీసీ పై పులను పంపిణీ చేశారు.
అనంతరం కో యిల్‌సాగర్ బ్యాక్ వాటర్ ఆధారంగా ని ర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సాగునీరు అందించడంతో బీడుభూములన్నీ పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం అవుతాయన్నారు. రైతు ల కండ్లల్లో ఆనందం చూడటమే ప్రభు త్వ లక్ష్యమన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌తోపాటు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి కృషి..
వెనుకబడిన దళిత కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే ఆల తెలిపారు. దళితబంధు లబ్ధిదారులైన చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన బండారి బాలరాజుకు, బండారి వెంకటన్నకు డీజే సౌండ్స్, గూడూరు గ్రామానికి చెందిన కురుమూర్తికి మొబైల్ దుకాణాలకు సంబంధించి మూడు యూనిట్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.