కల్వకుర్తి, మే 24 : కల్వకుర్తి కమ్యూనిటీ దవాఖానకు డయాలసిస్ సెంటర్ మంజూరైనట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. కల్వకుర్తి సీహెచ్‌సీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి సీహెచ్‌సీ ఇక నుంచి 100 పడకల దవాఖానగా మారనున్నదన్నారు. డయాలసిస్ సెంటర్ మంజూ రు చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. దవాఖాన నూతన భ వనం నిర్మించేందుకు పట్టణంలోని ప్ర భుత్వ భూమి 99 సర్వే నెంబర్లో 4 ఎ కరాలు కేటాయించామని, త్వరలోనే ప నులు ప్రారంభమవుతాయన్నారు.
సీహెచ్‌సీలో 10 పడకలతో మదర్ చైల్డ్ దవాఖానగా రూపాంతరం చెందనున్నదన్నా రు. అత్యాధునిక సౌకర్యాలు, ట్రామాకే ర్ సెంటర్, రక్తనిధి, ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. గాంధీనగర్, హరిజనవాడలో రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయని, వైద్యు లు, సిబ్బందిని నియమించనున్నట్లు చె ప్పారు. బీపీ, షుగర్, టీబీ వ్యాధులకు సంబంధించి వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయని, రోగుల మందుల కు ప్రతి నెలా రూ.500 ఇచ్చేలా కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. నియోజకవర్గంలో 30 పల్లె దవఖానలు ఏర్పాటవుతున్నాయని, మండలకేంద్రాల్లో ని రంతర వైద్య సేవలు అందిస్తామన్నారు.
విమర్శలు మానుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నా.. ప్రతిపక్ష నేతలు విమర్శలు ఎందు కు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నా రు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలందరిపైనా ఆరోపణలు చేస్తున్నారని.., వీళ్ల ను ఏమనాలో అర్థం కావడం లేదన్నా రు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, మంచి, చెడు విచక్షణ కోల్పోయారన్నారు. మోకాలికి.. బోడిగుండుకు ముడిపెడుతూ రాజకీయం చేస్తారని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రెడ్డి, విజయ్‌గౌడ్, చెన్నకేశవులు, సూర్యప్రకాశ్‌రావు, డాక్టర్ శివ రాం, గణేశ్, రాంరెడ్డి, షానవాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.