మహబూబ్‌నగర్, మే 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. జి ల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రెండోస్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని పక్కాగా చేయాలని, జూన్ 1నుంచి 11వ తేదీ వర కు బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నా రు. 291 పాఠశాలలను ఎంపిక చేయగా 54 పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులకు స్కానింగ్ చేసేందుకుగా నూ నూతనంగా బాలానగర్, కోయిల్‌కొండ దవాఖానల్లో ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్ ఉందన్నా రు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్నామని తెలిపారు.
అనంతరం జెడ్పీ సీఈవో చాంబర్లో వ్యవసాయంపై స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. అనువైన ప్రదేశాల్లో విరివిగా మొ క్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు ఏపు గా పెరిగే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీ ఈవో జ్యోతి, పశుసంపద జిల్లా అధికారి మధుసూదన్గౌ డ్, డీఎఫ్‌వో గంగారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నేటి సమావేశాలు వాయిదా
బుధవారం జరుగాల్సిన స్థాయీ సంఘాల సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈ వో జ్యోతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించాలని, తదుపరి తేదీని తెలియజేస్తామని పేర్కొన్నారు.