కోస్గి, మే 24 : మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని బస్ డిపో, బస్టాండ్, కూరగాయల షెడ్ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను మంగళవారం వా రు పరిశీలించారు. వారంలోగా పనులన్నీ పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించా రు. జూన్ 4న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలను సిద్ధంగా ఉంచాలని, అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.
పనులపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రజాప్రతినిధులు మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రణాళిక తయారు చే యాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వరప్రసాద్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ వేణుగోపా ల్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.