మహ్మదాబాద్, మే 20 : పచ్చిరొట్ట సాగుతో భూసారం పెరుగుతుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో శుక్రవారం రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయాధికారుల సలహామేరకు పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. భూసారం పెంచేందుకు రైతులు తప్పనిసరిగా జీలుగ విత్తనాలను చల్లాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో ప్రత్యూష, ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం నిర్వాహకుడు అశోక్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు గోపాల్‌రెడ్డి, తిర్మల్‌రెడ్డి, సాబేర్, భగవంతుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో విత్తనాలు
మూసాపేట(అడ్డాకుల), మే 20 : ప్రభుత్వం ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నదని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. అడ్డాకుల సింగిల్‌విండో కార్యాలయంలో శుక్రవారం రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నకు ఏ కష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహమూద్, డైరెక్టర్ కావలి కృష్ణయ్య, సీఈవో వెంకటయ్యగౌడ్, విజయ్‌కుమార్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, నరేందర్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.