మక్తల్ రూరల్, మే 20 : మినీ ట్యాంక్ బండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పెద్ద చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనుల ను శుక్రవారం ఆయన పరిశీలించారు. మిషన్ కాకతీయ ప థకంలో భాగంగా మినీ టాంక్ బండ్‌ను ఎమ్మెల్యే చిట్టెం ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారు. ప్రభు త్వం మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.5.73 కోట్ల ని ధులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పెద్ద చెరువు మ రమ్మతు పనులను పూర్తి చేశారు. అయితే మినీ ట్యాంక్ బం డ్ పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయి. కాగా ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ పనులు మిగిలిపోయాయి. పనుల్లో జాప్యం జరుగడంతో చెరువు కట్టపై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో ఎమ్మెల్యే చిట్టెం నీటి పారుదలశాఖ అధికారులతో మాట్లాడి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చెరువు కట్టపై కంప చె ట్లు, చెత్తను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పట్టణానికి తలమానికంగా తయారవుతుందని పేర్కొన్నారు. అలాగే పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ప ట్టణ ప్రజలకు పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు.