గండీడ్, మే 11 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పగిడ్యాల్, రంగారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో పండించిన వడ్లను విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వవైఖరి పాటించి తెలంగాణ రైతుకు అన్యాయం చేయాలని చూసిందన్నారు. రైతుకు నష్టం వాటిల్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామగ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ సేకరిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, ఎంపీటీసీ శైలజ, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఉప్పరి గోపాల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, నాయకులు రాంచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, అశోక్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఎంతో మేలు చేకూరుతున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. చిన్నవార్వల్కు చెందిన శాంతయ్యకు వైద్యఖర్చుల నిమిత్తం మం జూరైన రూ.20వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యం, ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు ప్రభుత్వం సీఎం సహాయనిధితో అండగా నిలుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, అశోక్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.