ఊట్కూర్, మే 7 : ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏకంగా సిమెంట్ గోదాంగా బీజేపీ నేత మా ర్చుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో వెలుగు చూ సింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో మూడు గదులు ఉండగా.. రెండు రూంలలో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతున్నది. మరో గది ఖాళీగా ఉండడంతో స్థానిక బీజేపీ నేత, మాజీ ఎంపీపీ పరపతిని ఉపయోగించి దర్జాగా సి మెంట్ గోదాంను నిర్వహిస్తున్నాడు. గోదాంతో పాటు ఏఆర్ ట్రేడర్స్ పేరుతో బోర్డు కూడా ఏ ర్పాటు చేసి కొన్నేండ్లుగా సిమెంట్ అమ్మకాలు కొ నసాగిస్తున్నాడు.
ఇంత జరుగుతున్నా సర్పంచ్, పాలకవర్గం మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంతో స్థానికుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కాగా శుక్రవారం గ్రామంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బడిలో సి మెంట్ గోదాంను చూసి అవాక్కయ్యాడు. వెంటనే తొలగించి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌ను ఆ దేశించారు. అయితే శనివారం డీపీవో మురళి నా మమాత్రపు తనిఖీలు చేసి సిమెంట్ బస్తాలను తరలించి గదిని ఖాళీ చేయించారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా స్థానిక శంకర్లింగేశ్వర స్వా మి గుట్టపై సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఆలయ క మిటీ సభ్యులు సిమెంట్ బస్తాలను స్టాక్ చేసినట్లు విచారణలో తెలిసిందని చెప్పారు.