మహబూబ్‌నగర్, మార్చి 30 : ఢిల్లీలోని ఉభయ సభల్లో కుల గణనపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడారు. రైతుల కోసం పోరాడుతుంటే కేంద్రం మాత్రం న్యాయం చేయడం లేదన్నా రు. అన్నిరాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ఎంపీలు మర్యాద లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. పార్లమెంట్లో తెలంగాణ అంశాలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.