
జడ్చర్ల, జనవరి 23 : అలుపెరగని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నేతాజీ 125వ జయంతి సందర్భంగా కావేరమ్మపేట చావిడి వద్ద గణేశ్ యువజన సంఘం, జడ్చర్లలోని నేతాజీ చౌక్‌లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహజ వనరులు, నదులను సరిగ్గా ఉపయోగించుకునింటే దేశం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదిగేదని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి పాలిస్తున్న ప్రభుత్వాలు, పార్టీలు సరే దిశగా ఆలోచన చేయలేదన్నారు. వారంతా అధికారంలోకి రావడం.. ఏ పథకాలు పెడితే ఓట్లు వస్తాయనే ఆలోచనపై దృష్టి సారించారని గుర్తు చేశారు. కానీ దేశం బాగుండాలి అని ఎవరూ ఆలోచన చేయలేదన్నారు. దేశంలో 75వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని, కానీ వాటిని ఉపయోగించుకోవడం లేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి సాగు, తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, మురళి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, కౌన్సిలర్లు మహేశ్, లత, జ్యోతికృషారెడ్డి, చైతన్యనాయక్, ఉమాశంకర్‌గౌడ్, పుష్పలత, దేవా, కిరణ్, శ్యాం, చైతన్య, రమేశ్, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు జీవన్ గుండప్ప, ప్రధాన కార్యదర్శి బాద్మి రవిశంకర్, వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు దోరేపల్లి రవీందర్, దోనూరు శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహన్, సత్యం, వెంకటస్వామిగౌడ్, నర్సింహులు, హఫీజ్, మాజీ సర్పంచ్ బుక్కా వెంకటేశం, నరేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.