
హన్వాడ, డిసెంబర్ 13 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని కొత్తపే ట దాసాంజనేయస్వామి ఆలయంలో సోమవారం దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర భుత్వం ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నదని తెలిపారు. కొత్తపేట దాసాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు స హకారం అందిస్తానని చెప్పారు. అనంతరం మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించా రు. అంతకుముందు ఆలయంలో శివలిం గం, పార్వతీదేవి, గణేశ్, నందీశ్వరుడు, నవగ్రహాల విగ్రహాలతోపాటు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ్, సర్పంచ్ చెన్న మ్మ, ఉపసర్పంచ్ రాములు, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మంత్రి
మహబూబ్‌నగర్ రూమండలంలోని వెంకటాపూర్‌లో సోమవారం గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజా కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. పడిపూజకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌ డ్, రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ ఆంజనేయులు, సర్పంచ్ మంగమ్మ, ఎం పీటీసీ మోతీలాల్, అయ్యప్పస్వాములు తదితరులు పాల్గొన్నారు.