
మహబూబ్‌నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పా లమూరు జిల్లా సాహితీమూర్తులకు ప్ర తిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కే.ఐ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంత చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళా, సాహిత్యరంగాన్ని అమితంగా ఇష్టపడే పద్మభూషణ్, శాంతా బయోటెక్‌ని క్స్ అధిపతి వరప్రసాద్‌రెడ్డి పురస్కారా లు అందజేయనున్నారు. ఎల్లూరి శివారెడ్డికి వరప్రసాద్‌రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని, డాక్టర్ జుర్రు చెన్నయ్య కు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆ డిటోరియంలో ప్రదానం చేయనున్నా రు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పురస్కార గ్రహీతలకు రూ. లక్ష నగదు, జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించనున్నారు.
దాశరథి పురస్కార గ్రహీత ఎల్లూరి..
ఎల్లూరి శివారెడ్డి కొల్లాపూర్ ప్రాం తంలోని కాలూరులో జన్మించారు. ఓ యూలో తెలుగు ఆచార్యుడిగా, శాఖ అ ధ్యక్షుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా, కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వ త పరిషత్ అధ్యక్షుడిగా విశిష్టమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాభారతంలో రస పోషణం, సురవరం ప్రతాపరెడ్డి జీవితం సా హిత్యం, రసరేఖలు, పూలకారు వంటి అనేక గ్రంథాలు రచించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాశరథి పురస్కారం అందుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి చెన్నయ్య..
తెలుగుభాషా సేవారత్న పురస్కారం అందుకుంటున్న డా.చెన్నయ్య జడ్చర్ల మండలం కావేరమ్మపేట వాస్తవ్యులు. ‘తెలుగు దినపత్రికలు.. భాషా సాహిత్య స్వరూపం’ అనే అంశంపై పరిశోధన చేసి ఓయూ నుంచి డాక్టరేట్ పొందారు. ప్రముఖ తెలుగు దినపత్రికలో పదేండ్లపాటు పాత్రికేయుడిగా పనిచేశారు. తెలు గు విశ్వవిద్యాలయంలో 26 ఏండ్లకు పై గా ప్రజా సంబంధాల అధికారిగా, ఆకాశవాణిలో సుమారు 30 ఏండ్లు క్యాజువల్ పద్ధతిలో న్యూస్ రీడర్‌గా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ప్ర ముఖుల ప్రసంగాల అనువాదకుడిగా పనిచేశారు. అనువాదాలు, మౌలిక రచనలతో కలిపి 15 గ్రంథాలు వెలువరించారు. ఉత్తమ ప్రజాసంబంధాల అధికారిగా, అనువాదకుడిగా, న్యూస్ రీడర్‌గా అనేక పురస్కారాలు అందుకున్నారు. సి లికానాంధ్ర అంతర్జాతీయ సంస్థ కు భారతదేశ ఉపాధ్యక్షుడిగా ఉ న్నారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా సేవలందించారు.
ఎల్లూరి, చెన్నయ్యకు పురస్కారాలు లభించడంపై పాలమూరు జిల్లా కవులు కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, డా.భీంపల్లి శ్రీకాంత్ సోమవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.