శ్రీశైలం, ఫిబ్రవరి 19 : శ్రీ శైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నా యి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. భ్రమరాంబ, మల్లికార్జునుల కల్యాణమహోత్సవం త ర్వాత రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యా లు, ఢమరుక నాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. అంతకుముందు ఆలయ ప్రాంగణం నుంచి స్వా మి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో తీసుకొచ్చారు.
అనంతరం ఆలయ సంప్రదా యం ప్రకారం రథాంగపూజ, హోమం, ర థాంగబలిలో భాగంగా గుమ్మడి, కొబ్బరికాయలు కొట్టి స్వామి, అమ్మవార్లకు సాత్వికబలి సమర్పించారు. అలాగే రాత్రి ఆలయ పు ష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకరం గా నిర్వహించారు. తెప్పోత్సవంపై స్వామి, అమ్మవారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆధునిక సాంకేతికతతోకూడిన వి ద్యుద్దీపాలంకరణ, సౌండ్సిస్టం, వాటర్ ఫౌం టేన్లను వీక్షించిన యాత్రికులు సెల్ఫీలతో హ డావుడి చేశారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలందుకున్న స్వా మి, అమ్మవార్లను ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి పుష్పాలంకరణ చేసిన తెప్పపై వి హరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమాల్లో ఈవో లవన్న, ధర్మకర్తల మండలి చై ర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, భక్తులు ఉన్నారు.