గద్వాల, ఏప్రిల్ 13 : తమ కూతురు అనార్యోగంతో బాధపడుతుందని ప్రభుత్వపరంగా చేయూత నిచ్చి పునర్జన్మ ప్రసాదించాలని కోరుతూ సోమవారం గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన చిన్నారి చైత్రిక తల్లిదండ్రులు మౌనిక, రమేశ్ ప్రజాసంఘాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితుల కథనం ప్రకారం పరుమాల గ్రామానికి చెందిన మౌనిక, రమేశ్ దంపతుల కూతురు చైత్రిక ఎస్ఎంఏ టైప్-1(స్పైనల్మస్కులర్అట్రోఫి) అనే జన్యుపర మైన వ్యాధితో హైదరాబాద్‌లో రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖానలో చిక్సిత పొందుతున్నది.
ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనపడి ఊపిరి పీల్చుకోవడానికి కష్టమవుతుందని చెప్పారు. చైత్రిక ప్రాణాలు కాపాడటానికి రూ.16కోట్ల ఖరీదైన జిమ్తెరఫీ ఇంజెక్షన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారని ఇంత భారీ మొత్తాన్ని భరించడం తమ వల్ల కాదని ప్రభుత్వ పరంగా చేయూత నిచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ను కోరారు. అందుకు కలెక్టర్ స్పందించి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పినట్లు వారు తెలిపారు.
మా ఊరు చిన్నోనిపల్లి రిజర్వాయర్‌లో ముంపునకు గురికాగా పునరావాస కేంద్రం కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలాల్లో గ్రామస్తులు ఇంటి నిర్మాణాలు చేపట్టి జీవనం కొనసాగిస్తున్నారని అయితే ఆర్ఆర్ సెంటర్లో ప్రజలు సమస్యలతో సతమతమవు తున్నారని సర్పంచ్‌తోపాటు ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్ఆర్ సెంటర్లో మి షన్ భగీరథ నీరు 10నిమిషాలు కూడా రా వడం లేదని దీంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. డ్రైనేజీల్లో పూడిక తీయడం లేదని, క్రీడాకారులకు సరై న క్రీడాప్రాంగణం లేదని, ఉత్తర దిశ భా గంలో ఊరికి రోడ్డు లేదని ఈ సమస్యలు పరిష్కరించాలన్నారు.
చిన్నోనిపల్లి ఆర్ఆర్ సెంటర్ పక్కన 10 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద గుట్టు ఉండగా, చాగదోణగ్రామానికి చెందిన వ్యక్తులు గుట్ట భూమి మాకు ప్రభుత్వం కేటాయించిందని తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చిన్నోనిపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ఈ గుట్టను చిన్నోనిపల్లి గ్రామానికి కేటాయించాలని సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు శివన్నగౌడ్, నర్సింహులు, హన్మంతు, వెంకటేశ్, రాముడు, బజారి కోరారు.
ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో ఆలయాల పేరు మీద ఉ న్న భూములకు పూజారులకు అధికారులు ఓఆర్సీ ఇవ్వగా ఓఆర్సీ ద్వారా వారి పేర్ల భూములను మీదకు మార్చుకొని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని పుల్లూరు దేవాలయ అభివృద్ధి సేవాసంఘం అధ్యక్షుడు గజేందర్‌రెడ్డి, ధర్మారెడ్డి, సతీశ్‌కుమార్‌రెడ్డి, కుమార్, మద్దిలేటి, బోయరాముడు తదితరులు ఆరోపించారు. పూజారులకు ఇచ్చిన ఓఆర్సీలు వెంటనే రద్దు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. పూజారులు కేవలం వాటిని అనుభవించాలే తప్పా అమ్ముకోరాదని నిబంధనలు చెప్తున్నాయన్నారు.