అయిజ, ఆగస్టు 12 : ఈ నెల 3న ఏపీలోని రాజమండ్రిలో హిట్ అండ్ రన్లో మృతి చెందిన మెడికో ప్రియాంక కు టుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి వెంకటేశ్‌కు భరో సా కల్పించారు. బుధవారం అయిజ మండలం, ఎక్లాస్ పురంలోని డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులను అల ంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తం డ్రి వెంక టేశ్తో ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. డాక్టర్ ప్రియాంకకు అందిన వైద్యం, మృతికి గల కారణాలను కేటీఆర్ అడిగి తెలుసుకొన్నారు. మృతికి కారణమైన నిందితులు ఎంతటివారైనా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా ఏపీ సర్కారుపై ఒత్తిడి తెస్తామని తండ్రి వెంకటేశ్‌కు హామీ ఇచ్చారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ న్నారు. హిట్ అండ్ రన్ దుర్మార్గుల చేతిలో మెడికో ప్రి యాంక బలికావడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజానికానికి మెరుగైన వైద్య సేవలు అందించనున్న తరుణంలో డాక్టర్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. తండ్రి న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ సలహాలు, సూచనలు చేస్తుందన్నారు. డాక్టర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా సహా య, సహకారాలు అందిస్తామన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంతో ఉండాలని కోరారు.
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చెరో కోటి చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రకటించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. బుధవారం అయిజ మండలంలోని ఎక్లాస్పురంలోని డాక్టర్ ప్రియాంక స్వగృహానికి చేరుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెడికో మృతి ఆమె కుటుంబానికి తీరనిలోటన్నారు. డాక్టర్ ప్రియాంక మృతికి గల కారకులకు కఠిన శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ప్రియాంకను కారుతో ఢీకొట్టి మృతికి కారకులైన దుర్మా ర్గులకు ఏపీ సర్కారు కాపాడే ప్రయత్నిం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దోషులకు తక్షణమే శిక్ష అమలు చేసేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు త్వరితగతిన చార్జిషీట్ వేసి ట్రయల్ నిర్వహించి శిక్ష పడేలా సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ఏపీ సర్కారును కోరారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పీజీ పూర్తి చేసే క్రమంలో నిందితులు డాక్టర్‌ను కారుతో ఢీకొట్టి పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కేసును నీరుగార్చకుండా కఠిన శిక్ష అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకో వాల ని, డాక్టర్ ప్రియాంక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకు ముందు డాక్టర్ ప్రియాంక తండ్రితో ప్రియా ంక విద్యాభ్యాసం, జరిగిన సంఘటన, రాజ మండ్రి, సికింద్రబాద్‌లోని కిమ్స్‌లో అందిం చిన వైద్యం తదితర అంశాలను తండ్రిని అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్, వైస్ చైర్మన్ మాల నర్సింహులు, మాజీ ఎంపీపీ సుందర్రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రా ములు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్ల య్య, సీనియర్ నాయకులు వేమారెడ్డి, నరసింహారెడ్డి, నాగన్న గౌడ్, భద్రయ్య, కౌన్సిలర్లు, కోఆప్సన్ సభ్యు లు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, ఆగస్టు 12 : వైద్య విద్యలో చక్కగా రాణిస్తున్న మెడికో ప్రియాంక మృతి కళాశాలకు తీరని లోటని రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాల యాజమాన్యం డాక్టర్ తరుణ్, సాధిక అన్నారు. బుధవారం మండలంలోని ఎక్లాస్పురం గ్రామంలోని మెడికో ప్రియాంక స్వగృహానికి చేరుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీజీ మెడికల్ ఫస్టియర్ చదువుతున్న ప్రియాంక విద్యలో చురుకుగా ఉండేదన్నారు. ఆమె మరణంతో కళాశాల యాజమాన్యంతోపాటు విద్యార్థులు శోక సంద్రంలో మునిగారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులకు ఏపీ ప్రభుత్వం కఠిన శిక్ష అమలు చేసేందుకు కళాశాల పక్షాన పోరాటం చేస్తామని, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని యాజమాన్యం కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది. అనంతరం రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.