గద్వాల అర్బన్, అక్టోబర్ 29 : కేటీదొడ్డి ఎస్సైని సాయుధ దళ కార్యాలయానికి అటా చ్ చేస్తు పోలీస్ శాఖ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అ యితే గత కొంత కాలంగా కేటీదొడ్డి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సదరు పోలీస్ అధికారి తన ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఎంతలా అంటే.. నేనే తోపు…నాకంటే ఎవ రు తోపు కాదు అన్న విధంగా వ్యవహరించడంపై మండల ప్రజలు పెదవి విరిచారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి పంచాయితీలో పైసలు ఉంటేనే వ్యవహరం నడిపేది.. పైసలు లేనిదే వ్యవహారం నడిచేది లేదు.. అన్న విధంగా కొనసాగించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ మధ్యే మండలంలోని వెంకటాపురం గ్రామంలోని జాతర సందర్భంలో జా తరకు వచ్చిన వ్యాపారుస్తులతోపాటు కర్ణాటక భక్తులతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అలాగే జాతరలో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా జాతరలో పట్టుబడిన దొంగ ను త ప్పించేందుకు ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భూమి పంచాయితీలు, ప్లాట్ పంచాయితీలు తదితర ప్రతి వ్యవహారంలో తన చేతివాటం ప్రదర్శించేవారని ఆరోపణలు అనేక ఉన్నాయి. అలాగే గతం లో ఓ మహిళను ఉద్దేశించి అసభ్యకరం గా మాట్లాడినట్లు కూడా ఆరోపణలు ఉండ గా అలాగే మట్టి, ఇసుక, బియ్యం మాఫీయాతోనూ సంబంధాలు ఏర్పచుకొని నెలనెలా మాముళ్లు తీసుకుంటున్నట్లు పుకార్లు వినబడ్డాయి.
సదరు పోలీస్ అధికారి తీరుపై మం డల ప్రజలు విసిగి చెంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీస్ అధికారులు ఎస్బీ అధికారులను నియమించి రహస్యంగా విచారణ చేపట్టిన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు పోలీస్ అధికారి విధుల్లో చేరినప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఏమేమి వ్యవహారాలు చేశా రో.. అన్ని చేర్చి ఓ నిదేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. జాతర వసూళ్లలో ముందుగా ఓ పోలీస్ సి బ్బందిపై వేటు వేయగా.. తాజాగా పోలీస్ అధికారి పాత్ర కూడా ఉందని తెలియడంతో ఆయనను ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తున్నట్లు పోలీస్ వర్గాలలో చర్చ జరుగుతున్నది. దీనిపై ఎస్పీ తోట శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రస్తుతానికి కేటీదొడ్డి ఎస్సైగా ఉన్న బిజ్జ శ్రీనివాసులును సాయుధ దళ కార్యాలయానికి అటాచ్ చేశామని చెప్పారు.
ప్రతి సారి వాళ్లు తప్పు చేసి తమపైనే వే టు వేస్తే.. ఎలా.. తప్పు ఎవరు చేశారో.. వారి పై చర్యలు తీసుకోవాలి…అంతే కానీ తమపైనే చర్యలు తీసుకోవడం ఏంటని కిందిస్థా యి ఉద్యోగులు చర్చించుకుంటున్న తెలిసిం ది. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో ‘జాతర వసూ ళ్లు’ అనే కథనంతో పోలీస్ ఉన్నతాధికారులు మొదటగా ఓ సిబ్బందిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన విషయం విధితమే. కాగా ఈ వ్యవహరంలో సిబ్బంది తప్పు లేకున్నా.. సిబ్బందిని అటాచ్ చేయడం ఏంటి .. కొంత మంది సిబ్బంది రహస్యంగా కలు సుకొని చర్చ చేసినట్లు సమాచారం. అధికారులుగా చలామణి అవుతున్న అధికారులు తప్పులు చేయడం లేదా.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలిసింది.