వనపర్తి, డిసెంబర్ 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల తో రాష్ట్రంలోని పేదింట ఆడబిడ్డల పెండ్లి బాజాలు మో గుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ పథకాలతో సర్కార్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 233 మందికి క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారితో కలిసి మంత్రి స హపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యే యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలం, బలగమని చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. మనది సంక్షేమ రాష్ట్రమని తెలిపారు. సామాన్యుల అవసరాలపై అవగాహన ఉంటేనే ఇలాంటి పథకాల అమలు సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్ర ఉద్యమంలో 14 ఏండ్లు ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాం కాబట్టే దేశంలో ఎక్కడా లేని పథకాలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక సాయం చేయలేదని గుర్తు చేశారు. ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులకు అండగా రూ.లక్షా 116 అందిస్తూ సీఎం కేసీఆర్ ఆ ఇంటికి మేనమామగా ఉంటున్నారని పేర్కొన్నారు. వివిధ కారణాలతో మీ పిల్లల పెండ్లిళ్లకు రాలేదని, అన్యదా భావించొద్దని కోరారు. అప్పుడు పెండ్లి భోజనం చేయలేదు కాబట్టే.. నేడు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తప్పకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంత బువ్వ వండి పెట్టాలని లబ్ధిదారులకు సూచించారు. అంతకుముందు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి జానపద పాటల రూపంలో కళాకారులు పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ మంద భార్గవి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, పాకనాటి కృష్ణయ్య, చీర్ల సత్యం, పుట్టపాకుల మహేశ్, నక్క రాములు, నాయకులు వెంకటేశ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లు నాణ్యతగా నిర్మించాలి..
జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగంగా.. నాణ్యతగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పట్టణంలోని 6వ వార్డులో రూ.కోటితో బీసీ హాస్టల్ నుంచి పీర్లగుట్ట డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, అలాగే 23వ వార్డులో రూ.5 లక్షలతో జములమ్మ ఆలయ నిర్మాణానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ముందుగా ఆయా వార్డుల కౌన్సిలర్లు నందిమళ్ల భువనేశ్వరి, కెంచె రవి మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, బండారు కృష్ణ, చీర్ల సత్యం, విభూతి నారాయణ, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, నాయకులు తిరుమల్, శ్యాం, రమేశ్‌నాయక్, మహేశ్, మార్కెట్ యార్డు డైరెక్టర్లు డానియల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.