గద్వాల అర్బన్, జూన్ 24 : ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మంగళవారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సూజాతతోపాటు నిందితులు నాగేశ్, పరుశు, రాజుతోపాటు తేజేశ్వర్ కుటుం బ సభ్యులను పోలీస్ ఉన్నతాధికారులు విచారించినట్లు సమాచారం. ఐశ్వర్యతో పరిచయం ఎలా అయిం ది.. ఎప్పుడు ప్రేమలో పడ్డాడు.. పెండ్లి ఎలా అయ్యి ంది..? వీరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా..? అన్న విషయాలను విచారించారు. విచారణ, కేసును వేగంగా ఛేదించాలని జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో నిందితులు వాడిన కారు పూర్తి డేటా సేకరించినట్లు తెలిసింది. షిఫ్ట్ కారుకు నెలకు రూ.25 వేల కిరాయి ఇచ్చేలా యజమానితో ఒప్పందం కుదుర్చుకొని తిరుమల్‌రావు నిందితులకు అప్పగించినట్లు సమాచారం. ఈనెల 17న కర్నూల్ నుంచి వచ్చిన కారు గద్వాల కిష్టారెడ్డి బంగ్లా సమీపంలో తేజేశ్వర్‌ను ఎక్కించుకొని పూడూరు సమీపంలోకి తీసుకెళ్లినట్లు.. అక్కడే కారులో తెచ్చుకున్న ఆయుధాలతో అతడిపై దాడికి పాల్పడి ఉండొచ్చని.. హత్య చేశాక మృతదేహాన్ని కారు డిక్కీలో వేసినట్లు పోలీసులు అంచనా వేశా రు.
అనంతరం ఎర్రవెల్లి చౌరస్తా మీదుగా అలంపూర్ టోల్గేట్ టచ్ కాకుండా షార్ట్‌కట్‌లో కర్నూల్లోని పాణ్యం చేరుకొని మృతదేహాన్ని పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాణ్యం నుంచి ప్రధాన రహదారిపై ఉన్న నన్నుర్ టోల్గేట్లో కార్కు సంబంధించిన పూర్తి డేటాను పోలీసులు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా కారులో ఎవరెవరు ఉన్నారు..? అన్న విషయాలపై టోల్ నిర్వాహకులతో ఆరా తీసినట్లు తెలిసింది. షిఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.