నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 11గంటలకు అమ్మవారిని ఆహ్వానించడానికి ఆమె పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ(దివి గ్రామం)కు బయలు దేరుతుంది. అమ్మవారి కోసం ఎద్దుల బండిని సిద్ధం చేస్తారు.
- నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- వేలాదిగా తరలిరానున్న భక్తులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
గద్వాల రూరల్, ఫిబ్రవరి 19 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 11గంటలకు అమ్మవారిని ఆహ్వానించడానికి ఆమె పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ(దివి గ్రామం)కు బయలు దేరుతుంది. అమ్మవారి కోసం ఎద్దుల బండిని సిద్ధం చేస్తారు. మరుసటి రోజు మెట్టినింటికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు అనగా 24వ తేదీ నుంచి ప్రతి మం గళ, శుక్రవారాల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొ క్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
అమ్మవారి ఆలయ చరిత్ర..
గద్వాల పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న జములమ్మ దేవస్థాన ప్రాంతం ఒకప్పుడు ఈత వనం. అక్కడికి సమీపంలో జమ్మిచేడు గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి చెందిన రైతు ఒకరు పొలాన్ని దున్నేందుకు నాగలితో ఆ ప్రాంతానికి వచ్చాడు. నాగలి లోతుకు పోవడానికి బరువు కోసం సమీపంలో ఉన్న ఒక రాయి తెచ్చి పొలం దున్నాడు. సాయం త్రం నాగలి వదిలి ఇంటికి పోయాడు. మరుసటి రోజు దున్నడానికి పొలానికి రాగా నాగలిపై ఉన్న రాయి కనిపించలేదు. అది యథాస్థానానికి చేరుకున్నది. మళ్లీ తెచ్చి నాగలితో దున్ని వదిలిపోయాడు. ఆ మరుసటి రోజూ మళ్లీ రాయి యథాస్థానానికి చేరుకున్నది. ఇలా ఎవరో కావాలని చేస్తున్నారని వారిని కనిపెట్టడానికి ఆ రాత్రి అక్కడే చాటుగా ఉన్నాడు. నిద్ర రాకుండా ఉండేందుకు చిటికెన వేలును సైతం కోసుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో నాగలిపైన ఉన్న రాయి అందమైన దేవతారూపం దాల్చి రైతు తెచ్చిన ప్రదేశం వరకు పోయి మళ్లీ రాయిగా మారింది. దీనిని చూసిన రైతు విషయం గ్రామస్తులకు చెప్పాడు. వారు నమ్మకపోతే మరుసటి రోజు వారికి చూపించాడు. అప్పటినుంచి ఆ గ్రామం వారు ఆ రాయిని ప్రతిష్ఠించి జములమ్మ దేవతగా కొలుస్తున్నారు. అయితే 1983లో రిజర్వాయర్‌ను నిర్మించడం వలన అమ్మవారి దేవాస్థానం ముంపునకు గురైంది. అక్కడి నుంచి అమ్మవారిని తియ్యడానికి ప్రయత్నించినా వారికి కండ్లు కనిపించలేదనేది ప్రచారంలో ఉన్నది. దీంతో చుట్టూ కరకట్టను కట్టి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
బ్రహ్మోత్సవాలకు పూర్తైన ఏర్పాట్లు..
బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, దర్శనానికి ఇబ్బందులు పడకుండా క్యూలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, 30 గదులను అందుబాటులో ఉంచారు. వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూరల్ ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వచ్చే భక్తులకు ఆలయం వరకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

