మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 3 : జోగుళాంబ జోన్-7 డీఐజీగా జోయెల్ డేవిస్ నియమితులయ్యారు. 2010 బ్యాచ్‌కు చెందిన డేవిస్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
బుధవారం జరిగిన బదిలీల్లో ఆయన జోగుళాంబ జోన్-7 డీఐజీగా బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎల్ఎస్ చౌహాన్ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ అయ్యారు.