అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 7 : తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం ఏకకాలంగా పలుచోట్ల (ఐటీ) ఏపీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఇందులో భాగంగా నే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మం డలం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వీకేర్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉదయం 8గంటల ప్రాంతంలో 6 వాహనాల్లో 15 మంది ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ జవాన్లతో మూ కు మ్మడిగా దాడులు నిర్వహించారు. ఉద యం 8 నుంచి అర్ధరాత్రి వరకు దాడులు కొనసాగుతునే ఉన్నాయి.
మొదట ఐటీ అధికారులు కోల్ట్‌స్టోరేజ్ కార్యాలయం, గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యం, స్టాక్ రిజిస్టర్లు, రైతుల వివరాలు, పంటల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కొన్నేండ్లుగా ఈ కం పెనీ పేరుపై రైతుల వద్ద పంటలను కొనుగోలు చేయడం, రైతుల పేరుపై ప్రభుత్వాలకు క్రయవిక్రయాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, గత ఏపీ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీల ద్వారా భారీ నగదు లావాదేవీలు నిర్వహించి 2024 ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు బదిలీలు జరగడంతో ఏపీ కి చెందిన ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని విశ్వసనీయ సమాచారం.
గోడలు దూకారు..
వీకేర్ కోల్డ్‌స్టోరేజ్‌లో ఐటీ అధికారులు దాడులు చేస్తుంటే కొంత మంది కోల్డ్‌స్టోరేజ్ సిబ్బంది గోడలు దూకి పారిపోయారని స మాచారం రావడంతో ఐటీ అధికారులు స్టోరే జ్ చుట్టూ పరుగులు పెట్టారు. గోపాల్ ఎక్కడంటూ మిగతా సిబ్బందిని నిలదీయగా ఏం పట్టన్నట్లు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
పట్టుకొస్తున్న ఐటీ అధికారులు
ఉదయం నుంచి కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుంటే కార్యాలయానికి రాని వారిని, బయటకు వెళ్లిన వా రిని ఒక్కొక్కరిగా పట్టుకొచ్చారు. ఐటీ దాడు లు జరుగుతున్నాయని తెలుసుకున్న కొంత మంది సిబ్బంది ఎక్కడికో పరారయ్యారని సమాచారం. వారి కోసం ఐటీ అధికారులు ప్రత్యేక వాహనాల్లో గాలిస్తున్నారని తెలుస్తుం ది. అలాగే కోల్డ్‌స్టోరేజ్ భాగస్వాములను, కు టుంబ సభ్యులను ఐటీ అధికారులు వారి ఇండ్లకు వెళ్లి వారి వాహనాల్లో తీసుకువచ్చా రు. అయితే కర్నూల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజ్ యజమనుల ఇండ్లల్లో కూడా ఐటీ అధికారు లు దాడులు నిర్వహించారని, ఈ దా డులు ఇంకా రెండు, మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.