చరిత్రనే చెరిపేస్తారా..?
తెలంగాణ గేయాన్ని మార్చడం చారిత్రక తప్పిదమే అంటూ రేవంత్ సర్కారుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో సంగీత దర్శకులే కరువయ్యారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి.
- తెలంగాణ గేయాన్ని మార్చడం తప్పిదమే..
- రాష్ట్రంలో సంగీత దర్శకులు కరువయ్యారా..?
- రేవంత్ అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహం
- కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తే సహించేది లేదంటున్న కవులు
తెలంగాణ గేయాన్ని మార్చడం చారిత్రక తప్పిదమే అంటూ రేవంత్ సర్కారుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో సంగీత దర్శకులే కరువయ్యారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు రాష్ట్ర అధికార ముద్ర నుంచి వారసత్వ చిహ్నం కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించేందుకు కుట్ర జరగడం సరికాదన్నారు. ఒకవేళ అదే జరిగితే ఉద్యమం తప్పదని పలువురు కవులు, రచయితలు, కళాకారులు, ప్రజలు హెచ్చరిస్తున్నారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, మే 31
ప్రభుత్వానిది అవివేక చర్య
ఇగోతో లోగోను మార్చడం సరి కాదు. అధికార చిహ్నాన్ని చూడగానే రాష్ట్ర గొప్పతనం తెలిసేలా ఉండాలి. ప్రస్తుతం ఉన్న చిహ్నం అలాగే ఉంది. రాజ సం, కళలు, కట్టడాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, త్యాగనిరతి అన్ని కలబోసిన చిహ్నం కాకతీయ కళాతోరణం, చార్మినార్. చిహ్నం రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను నలుదిశలా ఇనుమడింప చేసేదిగా ఉండాలి. అప్పుడే చిహ్నానికి, రాష్ర్టానికి గౌరవం. ఎందరో మేధావులు, కవులు, కళాకారుల కృషితో ఏర్పాటైన చిహ్నాన్ని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం.. కవులందరినీ అవ మానించడమే.. భావితరాలకు తెలంగాణ చరిత్రను తెలిపే ప్రయత్నం చేయాలి త ప్పా.. చెరిపే ప్రయత్నం చేయొద్దు. కాకతీయుల కళాతోరణం, చార్మినార్ రాచ రికపు ఆనవాళ్లని.. వాటి రూపురేఖలు లేకుండా చేయాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య. ప్రస్తుతం ఉన్న చిహ్నాన్ని కొనసాగిస్తూ అదనంగా వ్యవసాయం, కృష్ణ, గోదావరి నదులను జ్ఞప్తి చేసుకొని రూపొందించాలి.
– గోసాయి వేణు, వచన కవి, గద్వాల
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

