ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతే..
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ నుంచి జిల్లా సెంట్రల్ లైబ్రరీ సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- మాది అభివృద్ధి మంత్రం.. వారిది కులమతాల కుతంత్రం
- బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా..
- జనవరి తరువాత మ్యానిఫెస్టో అమలు
- ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 26 : ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ నుంచి జిల్లా సెంట్రల్ లైబ్రరీ సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ, దుకాణాల వద్ద తిరిగి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చేసిన తమకే ప్రజలంతా అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి వల్ల గతంలో మతకలహాలు జరిగాయాని, ఆ వ్యక్తే ఇ ప్పుడు కులాల కుంపట్లు రాజేసి ఓట్లు పొందాలని చూ స్తున్నాడని మంత్రి విమర్శించారు.
పాతకలెక్టరేట్ వద్ద నిర్మిమతువుతున్న వెయ్యి పడకల దవాఖాన అభివృద్దికి మచ్చుతునక మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోలోని ప్రధానాంశాలైన దివ్యాంగులకు రూ.6,016, ఆసరా రూ.5,016, సన్నబియ్యం, పేద మహిళలకు రూ.3వేల జీవనభృతి, ప్రతికుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా, రూ.400కే సిలిండర్ తదితర పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్ని విధాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలంతా సహకరించి ఎన్నికల్లో ఆఖండ విజ యం సాధించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు క్రిష్టయన్పల్లి మార్నింగ్ వాక్‌లో ప్ర చారం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్ షేక్ఉమర్, మాజీ కౌన్సిలర్ పద్మజా, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నటరాజ్, నరేందర్ పాల్గొన్నారు.
మాది అభివృద్ధి మంత్రం
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 26 : మాది అభివృద్ధి మంత్రం వారిది కులమతాల కుతంత్రం అని మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం సద్దలగుండు, హబిబ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ మహబూబ్‌నగర్‌లో పదేళ్లలో ఊహించని అభివృద్ధి చేశామని, ఐటీపార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. హిందూ, ముస్లింలు కలిసి వన్‌బైటూ చాయ్ తాగేలా ఇ ప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంతత, శాంతి సామరస్యం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే మరోసారి కా రు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చే శారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనార్టీ ముఖ్య నాయకుడు జహంగీర్ తన అనుచరులు వంద మందితో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. వా రికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ సాయిలు, జాబేర్బిన్సయీద్, విక్రమ్‌దేవ్, అల్తాప్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

