మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 5 : మూడు రోజులుగా పట్టణంలో వర్షం కురుస్తున్నది. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్, పరిసరా ప్రాంతాలను మంగళవారం ఆర్డీవో అనిల్‌కుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. రామయ్యబౌళి, బీకేరెడ్డికాలనీ, జగ్గీవన్రామ్నగర్, రేవాహోటల్తోపాటు ఎర్రకుంట తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మున్సిపల్ ఇంజినీరింగ్, అధికారులు ఉన్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్‌కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ట్యాంక్‌బండ్ మరమ్మతులు తర్వాత డ్రైనేజీ నీళ్లు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రసుత్త వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్యాంక్‌బండ్ కళకళలాడుతోంది.
హన్వాడ, సెప్టెంబర్ 5 : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరు వు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతున్నది. నాయినోనిపల్లి గ్రామం సమీపంలోని బెరోనికుంట అలుగుపారుతున్నది. వర్షాలకు జొన్న, కంది, ప త్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. చెరువుల్లోకి నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాత ఇండ్లల్లో ఎవరూ ఉండరాదని వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
బాలానగర్, సెప్టెంబర్ 5 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో రెండు రోజులుగా ము సురు వర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంతోపాటు పెద్దరేవల్లి, ఉడిత్యాల, గౌతాపూర్, మోతిఘణపూర్, నేరళ్లపల్లి, చిన్నరేవల్లి, పెద్దాయపల్లి, గుండేడ్ తదితర గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు నిండాయి. మండలంలో 40.2 మిల్లీ మీటర్లు నమోదైనట్లు తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మండలంలోని చిన్నరేవల్లిలో శిథిలావస్థలో ఉన్న రెండు ఇండ్లలో ఉండొద్దని, వేరే వద్దకు పంపించాలని తాసీల్దార్ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను ఆదేశించారు.
గండీడ్, సెప్టెంబర్ 5 : రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలో వాగులువంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని సాలార్‌నగర్, రంగారెడ్డిపల్లి పెద్దవాగు, చిన్న వార్వల్ చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి. వర్షాలు లేక పంటలు ఎండు ముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్లు అయ్యింది.
మహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : మహ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువుల్లోకి, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. మహ్మదాబాద్ మల్కచెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మండల కేంద్రంలో రోడ్లపై, ఇండ్ల చుట్టూ వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షాలతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 5 : మండలంలోని దమాయపల్లిలో గణపతిరాయుని చెరువు అలుగు పాటుకు దమాయపల్లికి వెళ్లె వంతెన కొట్టుకుపోయింది. దీంతో గ్రామంలోకి వెళ్లెందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై ఎంపీడీవో జయరాం, సర్పంచ్ హన్మంతు, కార్యదర్శి చైతన్యతో పరిస్థితిని సమీక్షించి ఇసుక బస్తాలతో గ్రామంలోకి ప్రజలు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు.
రాజాపూర్, సెప్టెంబర్ 3 : మండలంలో మూ డు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు ఏడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కుంటలకు, చెరువులకు వరదనీరు వచ్చి చేరుతుండడంతో రైతన్నలు ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని దుం దుభీ వాగు పరీవాహక గ్రామాలైన దోండ్లపల్లి, చెన్నవెల్లి, కుచ్చర్కల్, రాజాపూర్ వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్‌లు నిండి ప్రవహిస్తున్నాయి.
జడ్చర్ల, సెప్టెంబర్ 5 : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జడ్చర్ల నియోజకవర్గంలోని వాగులు పారుతున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో అవి నిండేందుకు సిద్ధంగా ఉన్నా యి. గత శనివారం 32మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం 16.3 మిల్లీమీటర్లు, మంగళవారం 13.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, కంది, ఆముదం, వరి, తదితర పంటలకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడుతున్నా యి. కానీ ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నది. మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెరువులు అలుగులు పారే అవకాశం ఉంది. జడ్చర్ల మండలంలోని దుందుభివాగు నిండుగా పారుతుంది. దీంతో లింగంపే ట, నెక్కొండ, అల్వాన్‌పల్లి, గుట్టకాడిపల్లి చెక్‌డ్యాంలు నిండి అలుగు పారుతున్నాయి.
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 5 : నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా మేరకు పురపాలిక శాఖ అప్రమత్తమైంది. ముసురుతో మురుగుకాలువలు నిండుగ ప్రవహిస్తున్నాయి. పలు కాలనీల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచింది. రామయ్యబౌళి, బీకేరెడ్డి కాలనీ, శేషాద్రీనగర్ తదితర కాలనీల్లో పెద్ద డ్రైనేజీల్లో పేరుకపోయిన చెత్తను, మట్టిని తొలగిస్తున్నారు. వార్డులో ప్రమాదాలు, ఇబ్బందులు వాటిల్లకుండా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. మున్సిపాలిటీ కాల్‌సెంటర్ నెంబర్ 7093911352 ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మూడు షిఫ్టులుగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురపాలికశాఖ అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాల్‌సెంటర్ ఏర్పాటు చేశాం. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. మురుగు కాలువల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు చేపడుతున్నాం. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కాల్‌సెంటర్‌కు 7093911352 ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాం.
– ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మహబూబ్‌నగర్