కోస్గి, ఫిబ్రవరి 13 : కోస్గి బల్దియాలో ఆ క్రమణలు కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. సోమవారం ఇరిగేషన్ డీఈ ఆనంద్‌కిశోర్ ఆర్డీవో, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్‌కు రెవెన్యూ, సర్వేయర్‌పై ఫిర్యాదు చేశారు. మండలంలో ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతుల పర్యవేక్షణకు గానూ చెరువులు, కుంటలు, పాటుకాల్వల సర్వేకు సహకరించడం లే దని డీఈ పేర్కొన్నారు. అందుకు స్పందించిన అదనపు క లెక్టర్ ఏడీతో మాట్లాడుతూ రేపటి నుంచి వారానికి ఒకరో జు కోస్గి సర్వేయర్ ఒక కుంట, కాల్వలు, చె రువులు ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే చేయాలని ఆదేశించారు. తాసిల్దార్ మమత తో ఆర్డీవో రాంచందర్‌నాయక్ ఫోన్‌చేసి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులతో కలి సి భవన నిర్మాణ అనుమతుల పర్యవేక్షణకు వెళ్లాలని, మరోసారి ఫిర్యాదు రావద్దని హె చ్చరించారు. నూతనంగా కోస్గికి వచ్చిన స ర్వేయర్ అరుణతో కలిసి కుం టలు, నాళాలు, చెరువులు, కా ల్వలు సర్వే చేసి ప్రజలకు ఇబ్బందిలేకుండా చూస్తామని డీఈ తెలిపారు.
శిఖం భూములను పట్టాలని చెప్పి ప్రజలను మోసం చే యడం సరి కాదని, 3 నెలల కిందట గుండుమాల్ పట్టణ శివారులో కప్పర్కుంటలో పట్టా భూమి అని సర్వేయర్, కోస్గి తాసిల్దార్ నివేదిక ఇచ్చారని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. అందుకు అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు భవన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు ప్ర యత్నిస్తున్నారన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి ఇ ది శిఖం భూమి అని, అందులో ఎలాంటి నిర్మాణాలు ఉం డవద్దని అదనపు కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు భవనాలు నిర్మించుకున్నారని ఆయన చె ప్పారు. రెవెన్యూ అధికారులు సహకరిస్తే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ సర్వే ఏడీకి వివరించారు.