Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
Irrigation water | సాగునీటి కాలువకు పడిన గండిని పూడ్చి నీటి వృథాను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారుల చర్యలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాగనూరు : సాగునీటి కాలువకు పడిన సంఘం బండ కాల్వ గండిని (Plugging) పూడ్చి నీటి వృథాను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారుల (Irrigation Officials ) చర్యలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు గండి పడటంతో విలువైన సాగునీరు వాగులోకి వృథాగా ప్రవహిస్తున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఈ సమస్యపై పత్రికలో కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గండిని పూడ్చేందుకు జేసీబీ యంత్రాన్ని పంపించి పనులు చేపట్టినట్లు కనిపించేలా ఫొటోలు తీసినప్పటికీ, వాస్తవంగా గండి పూడ్చే పనులు పూర్తి చేయకుండానే యంత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఇరిగేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గౌడ్ కాలువ గండిని పూడ్చామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం గండి అలాగే ఉందని రైతులు ఆరోపించారు. ఒకవైపు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
డీఈఈ వివరణలోనూ స్పష్టత కరువు
ఈ విషయంపై ఇరిగేషన్ డీఈఈ సురేష్‌ను వివరణ కోరగా, కాలువ గండి పూడ్చేందుకు యంత్రాన్ని పంపించామని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండానే యంత్రం తిరిగి వెళ్లిపోయిందని తెలియజేయగా, ‘ అవునా.. మా సిబ్బందిని అడిగి తెలుసుకుంటాను’ అని ఆయన సమాధానమిచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు నిజంగా జరిగాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రభుత్వం సాగునీరు, తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న తరుణంలో, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నీరు వృథా కావడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

