అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్
అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్ల్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
- టవేరా వాహనం స్వాధీనం
- ఆరుగురి రిమాండ్
- వనపర్తి ఎస్పీ అపూర్వరావు
వనపర్తి టౌన్, జనవరి 24: అంతరాష్ట్ర దారి దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్ల్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అంతరాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. పెబ్బేర్ పట్ట ణంలో గత సంవత్సరం సెప్టెంబర్ 11న లక్ష్మీదుర్గా ఆర్వెస్టర్ షోరూంలో షెటర్ పగులగొట్టి రూ.14వేల నగదును, బాలాజీ హోం నీడ్స్ షెటర్ను ధ్వంసం చేసి రూ.1000 నగదును దొంగిలించారని ఆమె చెప్పారు. చిన్నంబావి మండల పరి ధిలో గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి మహాలక్ష్మీ వైన్ షాపు షెటర్ను ధ్వంసం చేసి క్యాష్ కౌంటర్లో రూ.96వేలు దొంగిలించారని వెల్లడించారు. ఈ ఘటనలపై సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారన్నారు.
కాగా వీరు వనపర్తి జిల్లా కేంద్రంలో గస్తీ నిర్వహిస్తుండగా మహారాష్ర్ర్టకు చెందిన టవేరా వాహనాన్ని ఆపి విచారించగా వాహనంలోని వారు అనుమానస్పదంగా వ్యవహరించడం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మహారాష్ట్రకు చెందిన పార్థీ తెగకు చెందిన ముఠా ప్రధాన పట్టణ సమీపం లో డేరాలు వేసి ఆయుర్వేధ మందులు పగలు విక్రయిస్తు న్నట్లు నటిస్తు మహిళలు, ప్రధాన కూడళ్లల్లో ఉన్న రహదారుల వెంట షెటర్స్ను గమనించి అర్ధరాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడతారని ఆమె చెప్పారు. వీరు ఆరు , ఏడు నెలలుగా మహబూబ్నగర్, దేవరకొండ, కర్నూల్, సీసీ కుంట, ఎమ్మిగనూరు, మామిడాల పాడు, నంద్యాల రోడ్డు, మాదవరం , షెగలమర్రి, సున్నిపెంట, ఒర్వకల్లు, అనంతపురం, రాపాట్వడు, హిందూపురం, చిత్తురు, రేణిగుంట మండలం, కడప, నెల్ల్లూరు, దువ్వార్, సెట్టిగుంట, రైల్వే కోడూరు, ప్రోద్దుటూరు, కాజీపేట, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, బిజినపల్లి, కల్వకుర్తి, కొల్లాపూర్, దొమలపెంట, వికారాబాద్, తాండూర్, చేవేళ్ల, షాద్నగర్, షాబాద్, సైబరాబాద్, కర్నాటక, కేరళ రాష్ర్టాలల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.
రాజుశంకర్కాలే , భార్య సక్కుబాయి, కూతురు లక్ష్మీ, శేషతో పాటు దగ్గరి బం దువులైన విజయ్రామ కాలే, గణపతి శివాజీ కాలే, సలీం షేక్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి టయోటా వాహనం, షెటర్స్ ధ్వంసం చేసే పరికరాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. దొంగల ముఠా పట్టివేతలో ఎస్సై రుషికేశ్, అంజద్, రామస్వామి, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సమరసింహారెడ్డి, ఐటీ సెల్ పోలీసులు మురళీ, గోవిందు, రవి, మల్లికార్జున్లను ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

