కోటపల్లి : వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలను అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించారు. కోటపల్లి కస్తూర్బా (Kasturba) గాంధీ పాఠశాలలో ఇంటర్ తరగతులను ( Inter classes ) ప్రారంభించారు. పాఠశాలకు మొదటి రోజున విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ యశోధర, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో అక్తర్, ఎంఈవో వెంకటేశ్వర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత, తదితరులు పాల్గొన్నారు.