ఉమ్మడి జిల్లా రైతులు అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం ఆ పంటను సాగు చేసేందుకు రైతులు జడుసుకుంటున్నా రు. ఏవి అసలో.. ఏవి నకిలీవో తెలియక సతమతమవుతున్నారు. చాలామంది రైతులకు గతేడాది నకిలీ విత్తనాలను అంటగట్టడంతో పంట పెరిగినా పత్తి రాక తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. జిల్లాలో అధికార యంత్రాంగం టాస్క్‌ఫోర్స్ ను పెట్టినా వ్యాపారులు నకిలీ విత్తనాలను రై తులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
గద్వాల జిల్లా నకిలీ విత్తనాలకు కేరాఫ్‌గా మా రింది. భూత్పూర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, వ నపర్తి, నారాయణపేటలో కూడా నకిలీ విత్తనాలు మార్కెట్లో విచ్చలవిడిగా వచ్చేశాయి. దీంతో రైతులు పత్తి విత్తనాలను కొనాలంటేనే భయపడుతున్నారు. నాసిరకం విత్తనాలు కొని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారీ పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాక అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గో ప్లాపూర్లో వ్యవసాయ, పోలీసు శాఖలు సం యుక్తంగా తనిఖీలు చేపట్టి నకిలీ బీటీ పత్తి వి త్తనాలను భారీగా పట్టుకున్నారు.
సుమారు మూడున్నర లక్షల విలువైన 3.20 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నారాయణపేట జిల్లాలో ఊట్కూర్ పోలీసులు 13.7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చే సుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. గద్వా ల జిల్లా అయిజలోనూ నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద రైతాంగాన్ని వేధిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వానకాలం ప్రారంభానికి ముందే అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.