మాగనూరు కృష్ణ : మండలంలోని ముడుమల్ గ్రామ (Mudumal village) శివారులో అక్రమంగా నిలువ ఉంచిని ఇసుక డంప్‌ను అధికారులు సీజ్ (sand dump seize) చేసినట్లు తహసీల్దార్ వెంకటేష్ తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామ శివారులో ప్రతి రోజు రాత్రి నది మధ్యలో హిటాచి ద్వారా ఇసుక తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా పొలంలో చేస్తున్నారు.
ఈ ఇసుకను టిప్పర్ల ద్వారా కర్ణాటక రాష్ట్రానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఆదివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టి 12 ట్రిప్పర్ల ఇసుక డంపును ఆర్ఐ గుర్తించి సీజ్ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
టాస్క్‌ఫోర్స్ బృందం రాత్రి తనిఖీ చేపట్టడంతోనే ఇసుక డంపులు గుర్తించారని , వారిచ్చిన సమాచారంతోనే ఇసుక డంపులు సీజ్ చేశామని వివరించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.