మాగనూరు : వాగులో అక్రమంగా జేసీబీలు (JCBs) దించి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తే కఠిన చర్యలతో పాటు ట్రాక్టర్, జేసీబీలను సీజ్ చేస్తామని మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి ( RI Pratap reddy) హెచ్చరించారు. గురువారం మాగనూరు మండలం పరిధిలోని వర్కూరు, దాసరి దొడ్డి రీచ్‌లను (Sand Reaches) మాగనూరు ఆర్ఐ శ్రీశైలంతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అనుమతితో తరలిస్తున్న ఇసుకను పరిశీలించి ,వాగులు సందర్శించారు. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వాగులలో జేసీబీలు పెట్టి ట్రాక్టర్లల్లో ఇసుక నింపుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు ఇసుక రీచ్‌లను పరిశీలించామని వెల్లడించారు.
వాగులలో మనుషులు ద్వారానే ఇసుక లోడ్ చేయాలని, జేసీబీలతో చేయవద్దని సూచించారు. అక్రమంగా వాగులోకి జేసీబీలు చొరబడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం త్వరలో ప్రారంభం కానున్న టీఎస్ఎండీసీ ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఇసుక రీచ్ యజమానులున్నారు .