ఆత్మకూర్ : ఆత్మకూర్ పురపాలక పట్టణ పరిధిలో ప్రజల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి ( Peddamma Talli Temple ) ఆలయ నిర్మాణానికి పట్టణ ప్రముఖులు భారీగా విరాళాలను (Huge donations) అందజేస్తూ సహకరిస్తున్నారని ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్ ( Sridhar Goud ) తెలిపారు .
సోమవారం భాగ్యలక్ష్మి రైస్ మిల్ యజమానులు నీలేష్ కుమార్, ఉదయ్ కుమార్ లక్షా ఇరవై ఒక్క వేల రూపాయలను అందజేయగా, మరో రైస్ మిల్లు యజమాని మూలమల్ల రమేష్ శెట్టి లక్ష రూపాయలు, జయలక్ష్మి ట్రేడర్స్ యజమాని తిరుపతిరెడ్డి రూ. లక్ష ను ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారని వెల్లడించారు. పట్టణ ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుచుకుంటున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళాలను అందజేయాలని కోరారు.
ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు , పక్షం రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతూ విరాళాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రవికుమార్ యాదవ్, మనివర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్టీడీ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు కోట్ల వెంకటేష్, దామోదర్, నాగేష్, వెంకట్ రాములు, తదితరులు పాల్గొన్నారు.