
మరికల్, డిసెంబర్14 : మండలంలోని తీలేరులో వెలిసిన రేణుకాఎల్లమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అ లంకరించారు. అనంతరం భక్తులు, గ్రామస్తులకు అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింవుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధన లు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవతమ్మ, ఎంపీటీసీ సునీత, ఉపసర్పం చ్ బజరప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రుద్రలింగేశ్వర స్వామి ఉత్సవాలు
మండలంలోని రుద్రసముద్రంలో వెలిసిన రుద్రలింగేశ్వర స్వామి ఉత్సవాలు మం గళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యే కంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలతోపాటు పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బండారు చల్లుకొని కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కా ర్యక్రమంలో అర్చకులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో..
మండలకేంద్రంలోని శివారులో ఉన్న బయటి మరెమ్మ ఉత్సవాలు మంగళవారం ఘ నంగా నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఒకేసా రి బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. సు:ఖ సంతోషాలు, పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. జాతరలో భక్తులకు ఎ లాంటి ఆటంకాలు జరుగకుండా ఎస్సై శివ నాగేశ్నాయు డు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమం లో సర్పంట్ రాజు, ఎంపీపీ శ్యామలమ్మ, భక్తులు, మహి ళలు తదితరులు పాల్గొన్నారు.