తీగజాతి కూరగాయలతో అధిక దిగుబడి
పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి పందిరి వేసి తీగ జాతి కూరగాయలను సాగుచేస్తే.. ఇక వెను దిరిగి చూడాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధిం చొచ్చు. ఆధునిక పద్ధతులను పాటిస్తూవాతావరణ పరిస్థితులకు అనుగుణంగా
- నిత్యం 20 మంది కూలీలకు ఉపాధి
- కాకరతో లాభాలు ఆర్జిస్తున్న రైతు
- ఆదర్శంగా నిలుస్తున్న ముకురాల వాసి రాజేందర్‌రెడ్డి
పందిరి సాగు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి పందిరి వేసి తీగ జాతి కూరగాయలను సాగుచేస్తే.. ఇక వెను దిరిగి చూడాల్సిన అవసరం లేదు. తక్కువ
పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధిం చొచ్చు. ఆధునిక పద్ధతులను పాటిస్తూవాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పందిరిపై కూరగాయలను సాగుచేస్తే అధిక లాభాలు వాటంతట అవే వస్తాయని అంటున్నాడు కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన రైతు రాజేందర్‌రెడ్డి.. కల్వకుర్తి మండలం ముకురాల గ్రా మానికి చెందిన రైతు రాజేందర్‌రెడ్డి సం ప్రదాయ పంటలను సాగు చేసేవాడు. వ రి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేసి నా ఆశించిన ఫలితాలు పొందలేదు. క్రమంగా పెట్టుబడి ఎక్కువ కాగా ఓ దశలో అతడు వ్యవసాయం మానేసి ఏదైనా పని చేసుకోవాలనుకున్నాడు. కానీ తనకు బాగా వచ్చేది వ్యవసాయం మాత్రమే.. దీంతో ఏ పనిచేస్తే బాగుంటుందనే ఆలోచించి చివరకు కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. పందిరి పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తే ఫలితం ఉంటుందని స్నేహితులు చెప్పడంతో ఉద్యానవన శాఖ అధికారులను కలిశాడు. వారి సలహాలతో కూరగాయల సాగుపై దృష్టి సారించాడు.
2014లో ‘పందిరి’కి శ్రీకారం..
2014లో రాజేందర్‌రెడ్డి తన ఏడున్నరెకరాల్లో పందిరి వేయాలని భావించి ఉద్యానవన శాఖ అధికారులను కలిశాడు. వారి సలహాల మేరకు పనులు ప్రారంభించి రాతి కడీలను తెప్పించి పందిరికి అవసరమైన రీతిలో పాతించాడు. డ్రిప్ ఏర్పాటు చేసి కడీలపై పందిరి వేయించాడు. దీని కోసం దాదాపు రూ.19లక్షలు ఖ ర్చయ్యాయి. అదే మొదలు ఇక సాగులో అతడు వెనుదిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ.. బీర, కాకర, టమాట, సోరకాయ(అనంకాయ), చిక్కు డు వంటి తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
మరో రెండున్నర ఎకరాల్లో పందిరి..
గతేడాది మరో రెండున్నర ఎకరాల్లో పందిరి వేయించి డ్రిప్ సౌక ర్యం కల్పించాడు. మొత్తం 10 ఎకరాల్లో పందిరి ద్వారా తీగజాతి కూ రగాయలను సాగుచేస్తూ రాజేందర్‌రెడ్డి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పందిరి ద్వారా కూరగాయలు సాగుచేసేందుకు పూర్తిగా ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నాడు. అందుకు అవసరమైన పనికరా లు, పనిముట్లు కొనుగోలు చేశాడు. కూరగాయలు ఎలా తెంచాలి? ఎ క్కడ భద్రపర్చాలి? ప్యాకింగ్ ఎలా చేయాలని అనే అంశాలపై శిక్షణ తీసుకోవడం వల్ల కూలీలతో పనులు చేయించడం సులువైంది.
ఎనిమిదేండ్లుగా సాగు చేస్తున్నా..
ఎనిమిదేండ్లు గా పందిరి పద్ధతి లో సాగు చేస్తు న్నా. ఇలా కూరగాయల సాగు నాకు చాలా తృప్తినిస్తోంది. కాకర, బీర, చిక్కుడు, టమాట, సొర వంటి కూరగాయలు సాగుచేస్తున్నాను. ప్రస్తుతం కాకర సాగు చేయగా.. ఇప్పటివరకు మూడు కటింగ్స్ ద్వారా 14టన్నులు రూ.30 కిలో చొప్పున విక్రయించా. మరో 60టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పందిరి వ్యవసాయంతో చాలా బాగుంది. మా అబ్బాయి యూఎస్ఏలో, కూతురు హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతోంది.
– పసుల రాజేందర్‌రెడ్డి, రైతు, ముకురాల
ఏడున్నర ఎకరాల్లో కాకర సాగు
ప్రస్తుతం ఏడున్నర ఎకరాల్లో కాకర, రెండున్నర ఎకరాల్లో సోర తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్నాడు. కాకర దిగుబడి ప్రారంభమై 15 రోజలు అవుతుండగా ఇప్పటివరకు మూడుసార్లు కటింగ్ చేయగా 14 టన్నుల దిగుబడి వచ్చింది. మరో 80 రోజలపాటు దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు. మొత్తం పంట కాలానికి 80టన్నుల కాకర దిగుబడి వస్తుందంటున్నాడు. సొరకాయ తోట కూడా నెల రోజుల్లో కోతకు రానుండగా.. 30 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతు అంచనా వేస్తున్నాడు.
20 మంది కూలీలకు ఉపాధి
రాజేందర్‌రెడ్డి పొలానికి పక్క గ్రామం రంగాపూర్ నుంచి ప్రతి రోజూ 20మంది కూలీలు పనికి వస్తున్నారు. రైతు రంగాపూర్‌కు ట్రాక్టర్ పంపించి కూలీలను తీసుకొచ్చి.. పని కల్పిస్తున్నాడు. ప్రతి రెండు రోజులకోసారి కూరగాయలను ప్యాక్ చేసి వాహనంలో హైదరాబాద్‌లోని మండికి తరలిస్తారు. పందిరి వ్యవసాయం చేసేందుకు వీలుగా వ్యవసాయ క్షేత్రంలో చాలా వనరులు సమకూర్చుకున్నాడు. నీటి సమస్య తలెత్తకుండా పెద్దబావిని తవ్వించగా.. రెండు బోర్ల ద్వారా బావిని నింపేలా రైతు ఏర్పాట్లు చేసుకున్నాడు. డ్రిప్ ద్వారా తోటలకు బావి నుంచి నీరు పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

