మక్తల్ : పశువుల మేత కోసం నిలువ ఉంచిన గడ్డివాము దగ్ధమై (Haystack burnt) రూ.70 వేలా ఆస్తి నష్టం జరిగిన ఘటన మక్తల్ మండలం (Makthal mandal ) పంచదేవ్ పాడు గ్రామంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామస్థులు, బాధితుడు అందించిన సమాచారం ప్రకారం .. గ్రామానికి చెందిన మంగళి లక్ష్మయ్య అనే రైతు యాసంగి సీజన్ వరి పంట కోసిన సందర్భంలో పశువుల మేత కోసం పశువుల కొట్టం వద్ద గడ్డివామును నిలువ చేసుకొన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో గడ్డివాముకు నిప్పంటించి పరారు కావడంతో గడ్డివాము పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. అదే సమయంలో పక్కనే పశువులను గ్రామస్థులు కాపాడారు.