జడ్చర్లటౌన్, జూన్16 : జడ్చర్ల మండలంలోని కొత్తతండాలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తండావాసులు బైఠాయించారు. కొత్తతండా అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని తండావాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తండావాసులు తెలిపారు.
తండావాసుల విన్నపం మేరకు కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలని, అదే విధంగా గ్రామ కంఠం భూమిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తండావాసులు తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో వడిత్య రమేశ్నాయ క్, ఉమ్ల, భద్రు, వెంకటయ్య, చందర్, పాం డు, శంకర్, నారాయణ, మంజునాథ్, లక్ష్మ ణ్, శ్యాం, రాము, గోపాల్, సుధాకర్, పన్నిబాయి, లచ్చిబాయి, రూప్లిబాయి, మానికిబాయి, దేవిబాయి, జమ్నాబాయి, సక్రీ, ము త్యాలు తదితరులు పాల్గొన్నారు.