వనపర్తి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో పంతుళ్ల విధుల డుమ్మాకు కళ్లెం వేసేందుకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక కార్యాచర ణ చేపట్టారు. మూడు నెలలుగా అనేక పాఠశాలలను ఆ కస్మికంగా తనిఖీలు చేసి ఉపాధ్యాయుల హాజరు నియమావళి సరిగా లేదని గుర్తించారు. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని బడి వేళల్లో ప్రతి ఉపాధ్యాయుడికి జీపీఎస్ ఫొటో ను అమలు చేస్తున్నారు. ఈ విధానంతో సర్కార్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో మొక్కు‘బడు’లకు చెక్ పడనున్నది. వనపర్తి జిల్లాలో దాదాపు 546 ప్ర భుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 35వేల మంది బాలబాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. 2,150 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
జిల్లాలోని దాదాపు 100 పాఠశాలలను స్వయంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. జూన్‌లో బాధ్యత లు తీసుకున్న కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సా రించారు. వారంలో దాదాపు 8 నుంచి 12 పాఠశాలలను పరిశీలించారు. అంగన్వాడీలు, కేజీబీవీలు ఇలా అన్ని బడులను కలియ తిరిగారు. అక్కడున్న లోపాల ను స్వయంగా పరిశీలిస్తూ సవరించేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
పాఠశాలకు వెళ్లిన అనంతరం ప్రతి ఉపాధ్యాయుడు జీపీఎస్ ఫొటోను అప్డేట్ చేసేలా కలెక్టర్ ఆదర్శ్ సురభి నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని పీఎస్, యూపీఎస్, జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులం తా వారు వెళ్లిన సమయానికి జీపీఎస్ ఫొటోను బడి ఆ వరణ నుంచి తీసి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ గ్రూపునకు పంపాలి. అలాగే సెలవు పెట్టిన పంతుళ్లు సైతం మరొక గ్రూపులో వారి సెలవును పం పేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఏరోజుకు ఆరోజు వారీగా ఉదయం 9గంటలకు ఎంత మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు, ఎంత మంది సెలవు పెట్టారన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయా గ్రూపు ల్లో కలెక్టర్‌తోపాటు డీఈవో ఉండి పరిశీలన చేస్తారు. ఉ దయం 9గంటల్లోపు, 9:30 ఆ తర్వాత వచ్చిన ఉపాధ్యాయుల లెక్కను జీపీఎస్ కెమెరా ఫొటోల ద్వారా ప క్కాగా పరిగణలోకి తీసుకుంటున్నారు.
సమయపాలన పాటించని దాదాపు 50మంది ఉపాధ్యాయులకు డీఈవో కార్యాలయం నుంచి షాకాజ్ నోటీసులు జారీ చేశారు. గత ఆగస్టు 22న జీపీఎస్ ఫొ టో విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి 11 సెప్టెంబర్ వరకు దాదాపు 19 రోజుల్లో 55 మంది ఉపాధ్యాయులు 9:30 గంటల తర్వాత బడులకు చేరుకున్నారు. రోజు వారీ సమాచారమంతా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నమోదవుతుంది. ఈ మేరకు ఆలస్యంగా వచ్చిన వారందరికీ షోకాజ్ నోటీసులు పంపి వివరణ తీసుకుంటున్నారు. ఇలా ఆలస్యంగా వెళ్లే వారికి చర్యలు తప్పనిస రి ఉండాలని సమయానికి వెళ్లే ఉపాధ్యాయులంతా ఆశిస్తున్నారు. లేదంటే అందరూ ఆలస్యంగా వెళ్లడానికి మొగ్గుచూపుతారన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జీపీఎస్ సిస్టమ్ అమలుకు వచ్చిన తర్వాత పరిస్థితు లు చాలా మెరుగుపడ్డాయని ఉపాధ్యాయ వర్గాలే చ ర్చించుకుంటున్నాయి. ప్రారంభంలో కొంత ఇబ్బంది గా ఫీలైనా క్రమంగా కుదుటపడుతున్నారు. రాష్ట్రం లో ఎక్కడాలేని విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారని కొందరు గుసగుసలాడుతున్నా.. చాలా మంది ఈ చర్యలను సమర్తిస్తున్నారు. ఇక కొంత మంది ఇప్పటికే రాజకీయ నాయకుల వద్ద ఈ జీపీఎస్ విధానాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా, జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడం ద్వారా ఇబ్బందులున్నాయి.