ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా | కరోనా ఏర్పాట్లపై రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

జోగులాంబ గద్వాల : కరోనా ఏర్పాట్లపై రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక జనం పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాల్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ, తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో మహమ్మారి బారిన పడిన వారు త్వరగా కోలుకొని ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ కరోనా సోకిందేమోననే అనుమానంతో దవాఖానలో టెస్టులు చేయించుకోవాలనుకుంది. అయితే హైదరాబాద్ దవాఖానాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆక్సిజన్ దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో తన పుట్టినిల్లయిన గద్వాలకు చేరుకుంది. స్థానిక జిల్లా దవాఖానలో చేరింది.
ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందింది. కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. దీంతో ఆమెను వైద్యులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తన ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ దవాఖాన ఆవరణలో కృతజ్ఞతా భావంతో సుజాత ఒక మొక్కను నాటింది.
ఆక్సిజన్ నిల్వలు లేక అనేక మంది చనిపోతున్న తరుణంలో ప్రభుత్వ దవాఖానలో తనకు చక్కని వైద్యం అందించినందుకు వైద్యులకు సైతం సదరు మహిళ కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ వచ్చింది అని తెలియగానే ఆందోళన చెంది జిల్లాల నుంచి హైదరాబాద్ పరుగు పెట్టుకు రావాల్సిన అవసరం లేదంటున్నది.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలలో కూడా చక్కని వైద్యం అందుతోందని సుజాత తెలిపింది. మొన్న, గాంధీ దవాఖానలో తన ప్రాణం నిపినందుకు ఓ మహిళ దవాఖానకు దండం పెట్టడం వైరల్ గా మారిని విషయం తెలిసిందే. నేడు సూజాత మెరుగైన వైద్యం పొంది మొక్కను నాటడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు
జర్నలిస్ట్ శ్రీధర్ మృతి పట్ల సంతాపం తెలిపిన వినోద్ కుమార్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

