అలంపూర్ ఏప్రిల్ 26: అలంపూర్‌లోని శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానానికి (Jogulamba Temple) అదానీ యాజమాన్యం 520 బస్తాల సిమెంట్‌ను సమర్పించింది. ఇటీవల ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ సంస్థ కొనుగోలు చేసింది. టేకోవర్ ప్రక్రియ పూర్తిచేసుకోవడంతో చిత్తాపూర్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నుంచి మొదటి సిమెంట్లోడ్ను జోగులాంబ ఆలయానికి సమర్పించారు. ఈ మేరకు కంపెనీ ప్రతిధుల బృదంతోపాటు 520 సిమెంట్ బస్తాలతో కూడిన లారీని దేవస్థానికి పంపించింది.
అధికారులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అదానీ సిమెంట్ కంపెనీ పేరుపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదానీ సిమెంట్ కంపెనీ జోనల్ హెడ్ కే. నరేష్, టెక్నికల్ ఇంజినీర్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.