Gadwala | ఆర్డీఎస్ను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం
కర్నాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం పరిశీలించింది.
గద్వాల : కర్నాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం పరిశీలించింది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్నాటక, తెలంగాణ రాష్టాలకు విడుదల అవుతున్న నీటి విడుదల, ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర ఉన్న పెండింగ్ పనులు, ప్రధాన కాల్వ మరమ్మతు, కర్నాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమంగా చేస్తున్న నీటి చౌర్యం, ఆనకట్ట ను బ్యారేజీగా మార్పు చేయుటకు తీసుకోవాల్సిన చర్యలు, తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు అనుసరించాల్సిన అంశాలపై మూడు రాష్ట్రాల అధికారులతో సమీక్ష చేశారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు గత 75 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి కేఆర్ఎంబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులు చేయాలని తెలంగాణ సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతుండటంతో ఆర్డీఎస్ అందాల్సిన 15.9 టీఎంసీల నీరు అందటం లేదని వివరించారు. ఆనకట్టలో షీల్ట్ పేరుకుపోవడం, వరదలకు ఆనకట్ట దెబ్బతినడం, కాల్వ లైనింగ్ లేకపోవడంతో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా అందుకు తగ్గట్లు రావడం లేదని వివరించారు. ఏపీ సర్కార్ కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా 4 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టడంతో అడ్డుకున్నామని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మూడు రాష్టాల అధికారులతో ఆర్డీఎస్ పై సమీక్ష చేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

