
భూత్పూర్, జూలై 27 : రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో రైతువేదికను ఎమ్మెల్యే ప్రా రంభించి మాట్లాడారు. భవనాల్లో పంటల సాగు, ప్రభుత్వం రైతులకు చేస్తున్న పనులపై చర్చించాలన్నారు. కర్వెన ప్రాజెక్టు పనులు పూర్తయితే భూ త్పూర్ మండలంతోపాటు దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. అప్పుడు రైతువేదికల అవసరం ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ యశ్వంత్‌రావు, ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, వైస్ చైర్మన్ నారాయణగౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్ని, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ..
మండలానికి కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను ఎ మ్మెల్యే ఆల వెల్కిచర్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవసరం లేని వారు స్వచ్ఛందంగా రేషన్‌కార్డులను తిరిగి ఇవ్వాలని కోరారు. మండలానికి 173 కార్డులు వచ్చాయన్నారు.