వెల్దండ : నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనీపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ ఆలయ ( Yellamma Temple ) నిర్మాణానికి రాచూరు మాజీ ఎంపీటీసీ, యువ నాయకులు హరికిషన్ నాయక్ విరాళం ( Donations) అందజేశారు. మాజీ సర్పంచ్ రామచంద్రా రెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వాహకులకు ఆదివారం రూ.50 వేలు విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తిమ్మినోనీ పల్లి, రాచుర్ తండా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ రెడ్డి ,రమాకాంత్ రెడ్డి, యాదిరెడ్డి, రమేష్ రెడ్డి, శివరాజ్ గౌడ్, శేఖర్ గౌడ్, రవి గౌడ్, శ్రీను, శ్రీకాంత్, జగదీష్, హర్ష, కృష్ణ, రామస్వామి, కృష్ణయ్య, బాల్ రాజ్, వెంక టయ్య, నాగమ్మ, అలివేలమ్మ, చంద్రమ్మ , శోభన్, నరసింహ, లక్ష్మయ్య, గోపాల్ నాయక్, చిన్న నాయక్, కిషన్, గోపాల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.