వనపర్తి టౌన్/అచ్చంపేట/నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్, జూన్ 8 : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ సింగిరెడ్డి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తన సహాచరు డు, మృధుస్వభావి గోపినాథ్ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలందించారని మాజీ మంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల నివాళి..
జూభ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్థ్దివదేహానికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను, కుమారుడిని ఆయన ఓదార్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాలమరణం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మృతి పార్టీకి తీరనిలోటని, ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. అనంతరం మాగంటి కుటుంబసభ్యులకు
ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మృతి బాధాకరమని, పార్టీకి తీరని లోటని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడంపై మర్రి దిగ్భ్రాంతికి గురయ్యారు.
మూడుసార్లు జూబ్లీహిల్స్ నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసినట్లు తెలిపారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మాగంటి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోపినాథ్ మృధు స్వభావి, మంచి వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు.
బీఆర్ఎస్ నాయకుల నివాళి…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో గోపినాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ మాట్లాడుతూ గోపినాథ్ స్వయంకృషితో అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగారని, కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధిలో భాగస్వామి అయ్యారన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడు అకాల మర ణం చెందడం ఎంతో దురదృష్టకరమని ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కు టుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తె లిపారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నందిమల్ల అశోక్, నాగన్నయాద వ్, గులాం ఖాదర్‌ఖాన్, స్టార్ రహీం, జో హెబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, సాధిక్, అలీం, ఏకే పాషా తదితరులు ఉన్నారు.