మరోసారి మోసపోవద్దు
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు.
- హామీల అమలులో పూర్తిగా కాంగ్రెస్ విఫలం
- ఆర్ఎస్పీని భారీ మెజార్టీతో గెలిపించాలి
- బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఏప్రిల్ 22 : మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు. సోమవారం మా ర్నింగ్వాక్లో భాగంగా ఆయన పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్‌తో మాట్లాడారు. అక్కడి నుంచి పాతబజార్, లింగాల రోడ్డులోని టీస్టాల్ వద్ద టీ తాగి చిరు వ్యాపారులతోపాటు కలిసిన వారందరినీ పలుకరిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం రెండో వార్డులోని సాయినగర్ కాలనీలో పర్యటిస్తూ సర్కారు వైఫల్యాలు ప్రజలకు వివరించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, కాంగ్రెస్ వస్తూనే కరువును తీసుకొచ్చిందన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక అ క్రమ రవాణా, అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్నదన్నారు.
కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి ఇసుక కొనుగోలు భారంగా మారిందన్నారు. బీఆర్ఎస్ను ఓడించి తప్పుచేశామని ప్రజలు, రైతులు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించి జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదీ కాదని.. పేదల కోసం ప్రశ్నించే గొంతుకైన బీఆర్ఎస్ను ని యోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీ అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట ము న్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మైనార్టీ నాయకులు అమినుద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిజాల రమేశ్, కౌన్సిలర్లు నిర్మలాబాలరాజు, రమేశ్‌రావు, అంతటి శివ, నాయకులు శంకర్, వంశీ, రాకేశ్, లింగం, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

