పాలమూరు, జనవరి 9: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పే ర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భ క్తులకు తెలంగాణలో టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్కడి లోపాలను పరిశీలించుకోవాలన్నారు.
తెలంగాణ, తమిళనాడు, ఏపీ భక్తులకు తగిన సౌకర్యాలు, ఏర్పాట్లు చే యాలని కోరారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో తొక్కిసులాటలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. భక్తులందరికీ సమాన దర్శనం కల్పించాలన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక వస్తారని ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గాయాలపాలైన భక్తులకు చికిత్స అందించాలని, లేకపోతే వారిని హైదరాబాద్‌కు పంపాలన్నారు.