వనపర్తి, మే 19 : ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాశీంనగర్‌లో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బీసం సతీశ్ కు టుంబానికి పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్య భానుప్రియకు నిరంజన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా నిలుస్తుందని, పార్టీలోని కార్యకర్తలకు ఆపత్కాలం లో అండగా నిలిచేలా మొట్టమొదటిసారి బీమా పథకాన్ని బీఆర్ఎస్ పార్టీయే తీసుకొచ్చిందన్నారు.
అలాగే నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కురుమూర్తియాదవ్, సింగిల్ విండో చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి, మాధవరెడ్డి, నరేశ్, నర్సింహ, గోపాల్‌నాయక్, జాత్రునాయక్, శంకర్‌నాయక్, సంపత్‌కుమార్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మురళీసాగర్, కురుమూ ర్తి, రాము, మహేశ్, తిరుపతి, మోతీలాల్, గోవిం దు తదితరులు పాల్గొన్నారు.