మిడ్జిల్, జూన్ 30 : తెలంగాణ ఉద్య మం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. జై తెలంగాణ అని ఏనాడు అనలేదు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయని రేవంత్ ఉద్యమం గురించి మాట్లాడటం హా స్యాస్పదం అని ఆయన విమర్శించారు. మిడ్జి ల్ మండలకేంద్రంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేత వెంకట్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన హరీశ్‌రావుకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక తా సీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చారు.
బీఆర్ఎస్ నేత వెంకట్‌రెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడూతూ తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర డాక్టర్ లక్ష్మారెడ్డిదని, తెలంగాణ కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర శ్రీనివాస్గౌడ్దని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మరిచి గోదావరి నీటిని రాయలసీమ కు తరలిస్త్తూ బాబు జపం చేస్త్తున్నాడని రేవంత్‌రెడ్డిని విమర్శించారు.
చిల్వేరు గ్రామంలోని అక్విడెక్ట్ పనులు నిద్రాహారా లు మాని చేపించామన్నారు. ప్రస్తుతం మిడ్జిల్ మండలంలో సాగునీరు వస్తుందంటే అది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కృషే అని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుం టే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజ యం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తు న్నా.. చెప్పుకోదగ్గ ఆభివృద్ధి ఏం జరగలేదన్నా రు. కార్యకర్తలు అందరూ కలిసి బీఆర్ఎస్ నేత వెంకట్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడూతూ దివంగత వెంకట్‌రెడ్డి సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ జెడ్పీటీసీ శశిరేఖబాలు, సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్, గోపాల్, చంద్రయ్య, సీనియర్ నాయకులు కృష్ణ, వెంకట్ సాగర్, శ్రీనివాసులు, శ్రీనివాస్ గుప్తా, బంగారు, భీంరాజు పాల్గొన్నారు.