వంగూరు, జనవరి 3 : మండలంలోని తిప్పారెడ్డిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున రైతు బద్దుల లింగమయ్య అనే రైతు పొలంలో చిరుత సంచరిస్తుండగా చూ శానని ఆ గ్రామ రైతు కిశోర్రావు తెలిపారు. భయాందోళనకు గురైన రైతులు వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్టు అధికారులు చిరుత సంచరించిందని భావించిన రైతు లింగమయ్య పొలంలో జంతువు కాలిముద్రలను పరిశీలించా రు. అయితే ఇది చిరుత కాదని చిరుత రూపంలో వున్న గోల్డెన్ జాకిల్ అని నిర్ధారించారు.
ఈ జంతువు రైతుల ప శువులు, దూడలను పట్టి తింటుందన్నారు. పశువుల మాంసం, రక్తం దొరకకపోతే గోల్డెన్ జాకిల్ ఆ ప్రాంతాన్ని వదిలిపోతుందన్నారు. రైతులు తమ పశువులను వారం పాటు వ్యవసాయ పొలాల్లో కాకుండా తమ ఇండ్ల వద్దే కట్టేసి ఉంచుకోవాలని ఫారెస్టు అధికారులు సూచించారు.