అచ్చంపేట, సెప్టెంబర్ 30 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఏటీఆర్ (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. దాదాపు 2,611 చదరపు కి లోమీటర్ల మేర అడవి విస్తరించి ఉన్నది. 1,983 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర్ అభయారణ్యంగా ఉన్న ఈ అడవి తెలంగాణ ఏర్పాటుతో అమ్రాబాద్ అభయారణ్యంగా మారింది. దట్టమైన నల్లమలలో ఎన్నో ప్రకృతి అందాలతోపాటు వన్యప్రాణులు, జంతువులు, పక్షులకు నెలవు.
అలాగే అడవి ఒడిలో శ్రీశైలం, మల్లెలతీర్థం, భౌ రాపూర్, అక్కమహాదేవి గుహ, ఉమామహేశ్వరం, మద్దిమడుగు వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. సోమశిల నుంచి శ్రీ శైలం ప్రాజెక్టు వరకు కొండల మధ్య హోయలు పోతున్న కృష్ణానది అందాలు వర్ణణాతీతం. ఈ అడవి పెద్దపులులకు ప్రత్యేకంగా నిలుస్తోంది. పెద్దపులుల రక్షణకు ఏపీతో కలిపి జాయింట్ రివర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమే ణా పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 34 పులులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ అటవీ ప్రాంతం పెద్దపులులకు సేఫ్ జోన్‌గా మారింది.
మూడేండ్ల కిందట సఫారీ యాత్రను ఫారెస్ట్ అధికారులు ప్రారంభించగా.. విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న 8 వాహనాలకు అదనంగా మరో మూడు సఫారీ వాహనాలను సమకూర్చారు. అలాగే పర్యాటకుల కోసం కాటేజీలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంత పర్యాటకులు రాత్రి సమయంలో వీటిల్లో బస చేసి ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ఈ సఫారీ టూర్ కోసం ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా అటవీ ప్రాం తం వివరాలను ప్రజలకు అందరికీ తెలిసేలా ఏటీఆర్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
నల్లమల అటవీ అందాలు.. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య సాగే జంగల్ సఫారీని ఆస్వాదించాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. సఫారీ టూర్ మంగళవారం నుంచి పునఃప్రారంభంకానున్నది. ప్రతిఏటా జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు బ్రేక్ పడనున్న ది. ఈ మూడు నెలలు వన్యప్రాణుల సంతానోత్పత్తికి అ నుకూల సమయంగా భావించి అటవీశాఖ సేవలను నిలిపివేస్తున్నది. ఈ కాలంలో అటవీలోకి పర్యాటకులు, ఇతరులు వెళ్లకుండా నిషేధం విధిస్తారు. ప్రస్తుతం మూడు నె లల బ్రేక్ పూర్తవగా.. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తిరిగి సఫారీ టూర్ ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో సందర్శకుల కోసం వాహనాలను సిద్ధం చేశారు. ఈ టూర్ పర్యాటకులను మధురానుభూతిని మిగిల్చినున్నది.
నల్లమలలో సఫారీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. శ్రీశైలం వెళ్లేవారు ఎవరైనా ఈ సఫారీని ఎంజాయ్ చేయకుండా వెళ్లలేరు. సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. అడవీ ప్రాం తంలో వృక్షాలు, వన్యప్రాణులు, దట్టమైన అడవీ ప్రాం తం ఆకట్టుకుంటుంది. జంతువుల జాడ తెలుసుకునేందుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు, జంతువుల కోసం తాగునీటి ఏర్పాట్లు ఈ సఫారీ టూర్లో పర్యాటకులు చూసే అవకాశం ఉంటుంది.
పర్యాటకంగా అవగాహనతోపాటు విజ్ఞానం పెరగనున్నది. కొన్నిసార్లు వెళ్లేమార్గంలో అడవి జంతువులు దుప్పి, జింకలు, నెమళ్లు, అడవిపంది, రేసుకుక్కలు, ఇతర వన్యప్రాణులు కనిపిస్తాయి. రైడ్ మధ్యలో ఒక్కోసారి పులుల పాదముద్రములు, చెట్లపై వేసిన పంజాగుర్తులు, అడుగుజాడలు కనిపిస్తాయి. మరి ముఖ్యంగా నల్లమల అటవీప్రాంతం అనేక రకాల వృక్షాలు, జంతుజాలాలకు నిలయం కావడంతో ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చడం ఖాయం.
శ్రీశైలం వెళ్లే మార్గంలోని నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు సందర్శకులను ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. శ్రీశైలం వెళ్లేదారిలో ఫరహాబాద్ చౌరస్తా వద్ద సఫారీ వాహనాలు సిద్ధంగా ఉండనున్నా యి. ఆన్లైన్లో.. ఆఫ్‌లైన్‌లో వాహనాలు బుకింగ్ చే సుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 గంటల సాయం త్రం 5 గంటల వరకు సఫారీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాలుగు ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. రూ.5,500, రూ.6,500, రూ.7,000, రూ.8,000 వరకు ధర నిర్ణయించింది. ఒక సఫారీ వా హనంలో ఏడుగురు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకటి, రెండ్రోజుల పాటు బుకింక్ మేరకు సేవలు అందిస్తారు.
పర్యాటకులు రాత్రి బస చేసేందు కు వనమాలికలో ఏసీ, నాన్ఏసీ గదులు అందుబాటు లో ఉంచనున్నారు. బుకింగ్ తర్వాత మొదటిరోజు మ ధ్యాహ్నం 12 గంటల వరకు మన్ననూర్ వనమాలికకు సందర్శకులు చేరుకుంటే అక్కడ కాటేజీలను కేటాయిస్తారు. మరుసటిరోజు ఉదయం బయోటెక్ల్యాబ్, ప్లాస్టి క్ రీసైక్లింగ్ చేసే విధానం, వన్యప్రాణుల విడిభాగాల ప్రదర్శన, పర్యాటక కేంద్రం చూపిస్తారు. అక్కడి నుంచి సఫారీ వాహనంలో అడవి మార్గం మీదుగా ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవిలోకి వాహనంలో తీసుకెళ్తారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో సఫారీ వాహనం నుంచి అడవి అందాలను వీక్షిస్తూ ముందుకు యాత్ర కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రతి విషయాన్ని వాహనంలో ఉండే గైడ్.. సందర్శకులకు వివరిస్తారు.